Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయుడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు: విజయసాయి రెడ్డి

  • ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్ గా నటిస్తే అభ్యంతరముండదు
  • ఒకే సినిమాలో హీరోగా, విలన్ గా నటిస్తే అయోమయం నెలకొంటుంది
  • ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది
  • పవన్ నిజజీవితంలో తీరు ఇలాగే ఉంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ఉందని ఆయన అన్నారు. నిజ జీవితంలో ఆయన పోషిస్తోన్న పాత్ర ఫ్లాప్ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

'ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు' అని విజయసాయి రెడ్డి చురకలంటించారు.
Pawan Kalyan
Vijay Sai Reddy
Twitter
Jana Sena
YSRCP

More Telugu News